- Advertisement -
కరోనా ఎఫెక్ట్‌తో యూజర్లకు షాక్ ఇచ్చింది వాట్సాప్. ఇప్పటివరకు సరికొత్త సదుపాయాలతో వినియోగదారులను ఏదో ఒక ఫీచర్‌ను అందిస్తూనే ఉన్న వాట్సాప్ తాజాగా స్టేటస్ వీడియో టైంపై కోత విధించింది.
యూజర్లు తమ స్టేటస్‌లో పెట్టుకొనే వీడియోలు ఇక నుంచి 15 సెకండ్లకు మించి నిడివి ఉండరాదని సూచించింది. కరోనా నేపథ్యంలో యూజర్లు కుప్పలుతెప్పలుగా వీడియోలను స్టేటస్‌లు పెట్టుకుంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
వాట్సాప్ మొదలైనప్పడు స్టేటస్ వీడియోల నిడివి 90 సెకండ్లు ఉండేది. యూజర్లు పెరుగుతున్నాకొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తున్నది. ప్రస్తుతం 30 సెకండ్ల పాటు స్టేటస్ వీడియో అందుబాటులో ఉండగా తాజాగా దానిని 15 సెకన్లు చేసింది. భారత్‌లో వాట్సాప్ యూజర్లు 40కోట్ల మంది ఉన్నారు.
- Advertisement -