వాట్సాప్ పనిచేయట్లేదు..

375
- Advertisement -

భారత్ లో సెల్‌పోన్‌ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభా 108 కోట్లు. కాని ప్రతి ఇద్దరిలో ఒకరు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఇక వాట్సాప్ ద్వారా సమాచారాన్ని సులభంగా ఇతరులకు చేరవేసేందుకు సులువైంది.

అయితే కాసేపటి నుండి వాట్సాప్ పని చేయడం లేదు. దీనిపై యూజర్లు పెద్ద ఎత్తున కంప్లైంట్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి వాట్సప్ సేవల్లో అంతరాయం మొదలైంది. ఇలాంటి అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్‌లో వేల సంఖ్యలో కంప్లైంట్స్ వస్తున్నాయి.

హైదరాబాద్ , విశాఖపట్నం , బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ , లక్నో, నాగ్‍‌‌పూర్ ప్రాంతాల్లో యూజర్లకు వాట్సప్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనిపై వాట్సాప్ కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

- Advertisement -