వాట్సాప్‌….అదిరే ఫీచర్స్!

146
whatsapp
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ అదిరే ఫీచర్స్‌తో ముందుకురాబోతుంది.

ఎమోజీ రియాక్షన్లు, గ్రూప్ అడ్మిన్‌కు కొత్త పవర్, ఫైల్ షేరింగ్ సైజ్ పెంపు, వాయిస్ గ్రూప్‌ కాల్‌లో పార్టిసిపెంట్ల సంఖ్య పెంపు, కమ్యూనిటీలు తదిదర ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. విభిన్నమైన గ్రూప్‌లకు చెందిన యూజర్లను ఒకే గొడుగు కిందికి తెచ్చేలా కమ్యూనిటీస్ ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకురానుంది.
గ్రూప్‌లో ఏ మెంబర్ అయినా పోస్ట్ చేసిన మెసేజ్‌ను అడ్మిన్ డిలీట్ చేసే సదుపాయాన్ని ఈ ఫీచర్ కల్పించనుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో 100ఎంబీ సైజ్ వరకు ఉన్న ఫైల్‌ను మాత్రమే షేర్ చేసే అవకాశం ఉంది. అయితే 2జీబీ ఫైల్ వరకు షేర్ చేసే ఫీచర్ త్వరలోనే యాడ్ కానుంది.

దీంతో పాటు ఒకేసారి 32 మంది యూజర్లు గ్రూప్ వాయిస్ కాల్ మాట్లాడుకోవచ్చు. గ్రూప్ కాల్‌లో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టంగా తెలిసేలా పార్టిసిపెంట్స్ అందరికీ వేవ్ ఫామ్స్ యాడ్ చేస్తోంది. ఇక వాట్సాప్‌లోకి చివరగా ఎప్పుడొచ్చామన్న లాస్ట్ సీన్‌ను ఎంచుకున్న కాంటాక్టులకే కనపడే విధంగా కొత్త సదుపాయం రానుంది

- Advertisement -