వాట్సప్.. స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఒక ఆత్మీయ బంధువు. ఉదయం నిద్ర లేచిన దగ్గరననుంచి.. రాత్రి పడుకునే వరకూ క్షేమ సమాచారాలు, ఫొటోలు, డేటా షేరింగ్‌తో అందరిని పలుకరించే వాట్సప్ సేవలు ఇకపై ఉచితంగా అందవా? అనే సంకేతాలు కొద్దిరోజులుగా వెలువడుతున్నాయి. ప్రస్తుతం వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 బిలియన్ యూజర్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌కు కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫేస్‌బుక్ యాజమాన్యం.. 2014 కొనుగోలు చేసింది.తరువాత దీనిపై కొన్ని అనుమానాలు రేకెత్తినా ఇప్పటివరకూ ఉచితంగానే వాట్సప్ సేవలు అందిస్తోంది.
తాజాగా వ్యాపారవేత్తల కోసం ఈ యాప్‌లో బిజినెస్ టూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ టూల్‌ను వినియోగించాలనకుంటే మాత్రం సొమ్ము చెల్లించక తప్పదు. ఈ మొబైల్ బిజినెస్ టూల్ ఇంకా టెస్టింగ్ పొజిషన్‌లోఉంది. ఇదిపూర్తయ్యాక.. చిరు వ్యాపారులకు దీనిని మొదట్లో ఉచితంగా అందించాలన్న ఆలోచన ఉందని వాట్సప్ అధికారులు తెలిపారు. మన దేశంలో ఇప్పటికే ఈ టెస్టింగ్ దశలో ఉన్న ఈ టూల్‌ని బుక్‌మైషో ఉపయోగిస్తోంది.