- Advertisement -
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచింది. ఇటీవల వాట్సాప్‌నకు సంబంధించిన అనేక కొత్త ఫీచర్ల సంగతులు బయటికొచ్చాయి.ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ ‘పిక్చర్ ఇన్ పిక్చర్’ పేరిట కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో వీడియోలని మరో యాప్‌కి రీడైరెక్ట్ కాకుండానే వాట్సాప్ లోనే ప్రత్యేక విండోలో చూసేయొచ్చు.
ఇతరులతో చాటింగ్ చేస్తూనే థర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వీడియోలని వాట్సాప్‌లో ప్లే చేసుకోవచ్చు. ప్లేస్టోర్‌లో వర్షన్ 2.18.380 కి అప్ డేట్ చేసుకున్నవాళ్లు ఈ సదుపాయాన్ని పొందుతారు. కాగా, ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
- Advertisement -