ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకోస్తూ యూజర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ లో ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ యాప్ నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏదైనా టెక్స్ట్ రూపంలో మెసేజ్ పంపాలన్న లేదా ఫోటో పంపాలన్న వాట్సప్ ఉపయోగించే షేర్ చేస్తూ ఉంటారు. ఇలా మన డైలీ యుసెజ్ లో వాట్సాప్ ఎంతో ముఖ్యమైపోయింది.
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్న వాట్సాప్ తాజాగా వాట్సాప్ చాట్ పే యాప్షన్‌ను తీసుకురానుంది. ఇక ఈ ఫీచర్‌తో ట్రైన్ టికెట్ , ఫుడ్ ఆర్డర్ ఆన్ లైన్ సర్వీసులు అన్ని చేసుకోవచ్చు. కేవలం ఒకే చాట్ ద్వారా. మనకు ఏం కావాలో చాట్ ద్వారా వెల్లడిస్తే కావల్సిన ఆప్షన్స్‌ని ఇస్తుంది వాట్సాప్. దీంతో మనకు కావల్సినవి ఆర్డర్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు.
కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంతమంది యూజర్స్ కైనా సపోర్టు ఇచ్చేలా ఈ ఫీచర్‌ని తీసుకొచ్చారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
Also Read:రాజధానిపై జగన్ ఫిక్స్?