ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్. ఎన్నో ఇన్స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా..వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న…తాజాగా మరో అదిరే ఫీచర్‌తో ముందుకొచ్చింది.
లాక్‌చాట్ పేరుతో యూజర్లు తాము కోరుకుంటున్న చాట్‌ను ఇతరులకు కనిపించకుండా చేసుకోవచ్చు. మీరు మరో వ్యక్తితో చేసే చాట్ కన్వర్జేషన్ ఎవరికీ కనిపించకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మీరు ఎంచుకున్న కాంటాక్ట్‌ను పాస్వర్డ్ లేదా ఫింబర్ ప్రింట్‌తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
Also Read:హ్యాపీ బర్త్ డే..రాఘవేంద్రరావు
అంతేకాదు మీరు ప్రొటెక్ట్ చేసుకున్న కాంటాక్ట్ చాట్ బాక్స్‌లో కూడా కనిపించదు. అలాగే సదరు కాంటాక్ట్ నుంచి మెసేజ్ వచ్చినా పైన కనిపించే నోటిఫికేషన్లో ఆ మెసేజ్
కనిపించదు. మనం ఏ చాట్ నైనా లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
()మొదట మీ వాట్సాప్‌ను అప్ డేట్ చేయాలి.
()మీరు ఏ చాట్‌ని లాక్ చేయాలని భావిస్తున్నారో దాని ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయాలి
()మీకు కొత్తగా ‘చాట్ లాక్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది డిసప్పియరింగ్ మెసేజ్ మెనూ కింద కనిపిస్తుంది.
()ఇప్పుడు చాట్ లాక్ ను ఎనేబుల్ చేయాలి. ఇందుకోసం మీరు పాస్ వర్డ్ లేదంటే ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి.వెంటనే చాట్ లాక్ అవుతుంది.
(0లాక్ చేసిన చాట్‌ను చూడాలంటే మీ వాట్సాప్ హోం పేజ్ని కిందకి స్వైప్ చేయాలి.
()మీ పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే చాట్ లాక్ కనబడుతుంది.
Also Read:CMKCR:తెలంగాణ దశాబ్ది ఉత్సవ లోగో ఆవిష్కరణ