Whatsapp:కాల్ రికార్డింగ్ చేయండిలా?

24
- Advertisement -

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకోస్తూ యూజర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ లో ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ యాప్ నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏదైనా టెక్స్ట్ రూపంలో మెసేజ్ పంపాలన్న లేదా ఫోటో పంపాలన్న వాట్సప్ ఉపయోగించే షేర్ చేస్తూ ఉంటారు. ఇలా మన డైలీ యుసెజ్ లో వాట్సప్ ఎంతో ముఖ్యమైపోయింది.

ఇక ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వస్తున్న వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇకపై ఇన్‌కమింగ్ లేదా అవుట్ గోయింగ్ కాల్స్ రెండింటిని సులభంగా రికార్డు చేయొచ్చు. ముందుగా మీ ఫోన్‌లో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేయాలి. అయితే దీన్ని ఆన్ చేయడానికి ముందుగానే మీడియా, మైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టార్ట్ రికార్డింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ వాట్సాప్ కాల్ రికార్డ్ అవుతుంది. అంతేకాదు వీడియో కాల్ రికార్డు కూడా అవుతుంది.

వీడియో కాల్స్ కూడా రికార్డ్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ రికార్డు చేసేందుకు గూగుల్ ప్లేస్టోర్లో “Call Recorder Cube ACR” యాప్ డౌన్‌లోడ్ చేసి వాడుకోవచ్చు. ఈ యాప్ ఉంటే ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ వాట్సాప్ కాల్స్ అన్నింటినీ ఆటోమేటిక్‌గా రికార్డ్ చేయగలదు. ఈ యాప్‌లో టెలిగ్రామ్, స్లాక్, జూమ్, ఫేస్‌బుక్, సిగ్నల్ వంటి ఇతర యాప్స్ కాల్స్‌ను కూడా రికార్డ్ చేయొచ్చు.

Also Read:అంగ‌న్‌వాడీల‌ జీతాలేవి: దేవీ ప్ర‌సాద్

- Advertisement -