- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ వినియోగదారుల సేఫ్టీ కోసం సరికొత్త ఫీచర్‌ని తీసుకురాబోతుంది.
ప్రస్తుతం వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించేవారు డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్కు కనెక్ట్ చేయాలంటే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. అయితే.. ఈ విధానం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వాట్సాప్ పేర్కొంది.
వాట్సాప్ వెబ్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే ముందు వినియోగదారుడు తన బయోమెట్రిక్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ను అందించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
- Advertisement -