మనలో చాలా మందికి ఒకానొక సమయంలో ఆకలి లేకపోయినా, ఒక్కసారిగా చాక్లెట్, చిప్స్ లేదా ఏదైనా క్రిస్పీగా తినాలని అనిపిస్తుంది. ఇవి కేవలం అలవాటు లేదా కంట్రోల్ లేకపోవడం వల్లనే కాదు. ఇవి మన శరీరం, మెదడు, భావోద్వేగాల కలయిక. ఇది యాదృచ్ఛికం కాదు. అవి శరీరం నుంచి వచ్చే సంకేతాలు.
కోరికలు మొదట మెదడులోని “reward center”లో ప్రారంభమవుతాయి. చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు.
డోపమైన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది → ఆనంద భావన
మెదడు ఈ ఆహారాన్ని “సంతోషం”తో కలిపి గుర్తుంచుకుంటుంది
ఇంకా:
గ్రెలిన్ (ఆకలి హార్మోన్)
లెప్టిన్ (తృప్తి హార్మోన్)
ఇవి సరైన నిద్ర లేకపోతే, ఆహార అలవాట్లు సరిగా లేకపోతే అసమతుల్యంగా మారి అవసరం లేకపోయినా cravings వస్తాయి.
తీపి ఆహారం ఎందుకు కావాలి?
రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గితే → శరీరం శక్తి కోసం చక్కెర కోరుతుంది
ఒత్తిడి లేదా అలసట ఉన్నప్పుడు → చక్కెర serotonin పెంచి mood improve చేస్తుంది.
Also Read:బీజేపీలో చేరిన ఆప్ నేత ఫూల్కా!
ఉప్పు ఎప్పుడు తీసుకోవాలనిపిస్తుందంటే శరీరంలో నీటి కొరత ఏర్పడ్డడపుడు, ఎక్కువగా చెమటపట్టడం, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్సింగ్‌గా లేనప్పుడు. అయితే ఎక్కువ ఉప్పు తీసుకుంటే..హై బీపీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
క్రంచీ ఫుడ్స్ అంటే మనకు ఎందుకు ఇష్టం అంటే..క్రంచీ ఫుడ్స్ తీసుకుంటే మెదడును ఉత్తేజపరుస్తుంది. నమలడం వల్ల ఒకరకమైన రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది. బోర్‌గా ఉన్నప్పుడు లేదా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు చిప్స్ వంటి ఫుడ్స్ ఎక్కువగా తినడానికి ఇదే కారణం.

