WTF- ‘వాట్ ది ఫిష్’ మేకర్స్ సినిమాలోని ప్రముఖ నటీనటులని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ కోసం యాక్టర్స్ అదితి, జాన్సన్, హరినాథ్ పొలిచెల్రా, సుస్మితా ఛటర్జీ, సత్యలకు వెల్కమ్ చెప్పారు.
వరుణ్ కోరుకొండ డైరెక్షన్ లో, 6ix సినిమాస్ బ్యానర్‌పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్న ‘వాట్ ది ఫిష్’ ఒక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్, హైలేరియస్ ఎంటర్‌టైనర్. హై ప్రొడక్షన్ వాల్యూస్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. ప్రముఖ నటీనటులు ఉండటం సినిమాకు గ్రేట్ వాల్యుని యాడ్ చేస్తోంది.
ఈ మూవీ ట్యాగ్‌లైన్ – వెన్ ద క్రేజీ బికమ్స్ క్రేజియర్. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.వివిధ భాషల్లో షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన నిహారిక కొణిదెల, వెన్నెల కిషోర్‌ల ఫస్ట్‌లుక్ పోస్టర్‌లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read:ఖర్జూర పండు..ఎన్ని లాభాలో!