జూన్ 21….ప్రత్యేకత ఏంటో తెలుసా..!

354
june 21st
- Advertisement -

జూన్ 21…ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఒక్కరోజే ఏడు ప్రత్యేక రోజులకు వేదిక. యోగా డే, ఫాదర్స్ డే ఇలా ఏడు ప్రత్యేక రోజులకు జూన్ 21 నాంది పలికింది.

ప్రపంచ యోగా దినోత్సవం :ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జూన్ 21ను అంతర్జాతీయ మోగా దినోత్సవంగా ప్రకటించింది.

ఫాదర్స్ డే: ప్రతి ఏటా జూన్ 3వ ఆదివారం ఫాదర్స్‌ డే నిర్వహిస్తారు. నాన్నకు ఓ ప్రత్యేక రోజు అనేది ఉండాలని కాదు. కానీ కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడి బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తన సుఖాన్ని కూడా పక్కన పెట్టి కుటుంబం శ్రేయస్సు కోసం పాటుపడే తండ్రిని గౌరవించుకునేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

షేక్ హ్యాండ్ డే: జూన్ 21 ఆదివారం నాడు షేక్ హ్యాండ్ డే . కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని ఈ ఏడాది కరచాలన దినోత్సవం జరిగేలా లేదు.

సంగీత దినోత్సవం: వరల్డ్ మ్యూజిక్ డేను కూడా రేపు జరుపుకోనున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో 1982లో ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం 120 దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

ప్రపంచ మానవత్వ దినోత్సవం: జూన్ 21 వరల్డ్ హ్యూమనిస్ట్ డే కూడా. ప్రజల్లో మానవత్వాలను పెంచేలా 1980 నుంచి మానవత్వ దినోత్సవం జరుగుతోంది. ఎన్నో దేశాల్లోని మానవ హక్కుల సంస్థలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

జల దినోత్సవం: వరల్డ్ హైడ్రోగ్రఫీ డే కూడా రేపు జరుగనుంది. జల వనరుల అభివృద్ధికి ప్రజలను కట్టుబడివుండేలా చేసేందుకు హైడ్రోగ్రఫీ డే, 2005 జూన్ 21 నుంచి ప్రారంభమైంది. ఐరాస కూడా దీన్ని గుర్తించింది.

టీ షర్ట్ డే: వీటన్నింటితో పాటు టీ షర్ట్ దినోత్సవం కూడా రేపే.టీ షర్ట్ డే వల్ల సమాజానికి ఎటువంటి శ్రేయస్సు లేకపోయినా..2008లో ఓ జర్మనీ దుస్తుల సంస్థ దీన్ని ప్రారంభించింది. యువత దీన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు.

- Advertisement -