వేసవిలో నోరు పొడిబారడం సర్వ సాధారణమైన సమస్య. ఎందుకంటే బయట ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. తద్వారా శరీరంలో నీటిశాతం తగ్గిపోతుంది. దాంతో డీహైడ్రేషన్ బారిన పడడం, తరచూ నోరు పొడిబారడం వంటి సమస్యలకు దారి తీస్తాయి. అయితే నోరు పొడిబారడానికి ఇంకా చాలా కారణలే ఉన్నాయి. ఎక్కువగా నోటితోనే ఊపిరి పిల్చుకున్నప్పుడు కూడా నోరు పొడిబారడం జరుగుతుంది. ఇంకా ధూమపానం, మద్యపానం సేవించే వారిలోనూ ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది..
ఈ వేసవికాలంలో కూల్ డ్రింగ్స్, కాఫీ, టీ వంటి పానీయాలు ఎక్కువగా తాగిన నోరు పొడిబారే సమస్య వేధిస్తుంది. కాగా ఈ సమస్య ఉన్నవారిలో ఎక్కువసేపు మాట్లాడడంలోనూ, ఏదైనా ఆహారాన్ని మింగడంలోనూ ఇబ్బంది పడుతుంటారు. ఇంకా నోటిలో లేదా గొంతులో మంటగా ఏర్పడడం, నోటి దుర్వాసన ఏర్పడడం, రుచి లేదా వాసన ను గ్రహించలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి వేసవిలో ఏర్పడే ఈ సర్వసాధారణ సమస్యను అధిగమించడానికి కొన్ని సూచనలు, చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటో చూద్దాం !
నోరు పొడిబారే సమస్యను అధిగమించేందుకు నీరు ఎక్కువగా తాగాలి. నీరును పుష్కలంగా తాగడం ద్వారా శరీరం డీహైడ్రేషన్ బారిన పదకుండా ఉంటుంది. తద్వారా నోరు పొడిబారకుండా ఉంటుంది. నోటి శుభ్రత కచ్చితంగా పాటించాలి. క్రమం తప్పకుండా బ్రేష్ చేసుకోవాలి. కెఫీన్ పదార్థాలు ( టీ, కాఫీ వంటివి ), ఆల్కహాల్, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి. చూయింగ్ గమ్ నమలడం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. దాంతో నోరు పొడిబారకుండా ఉంటుంది. ఈ చిట్కాలు సూచనలు పాటించి వేసవిలో నోరు పొడిబారే సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
Also Read:వాట్సాప్ బ్యాన్ అయిందా..ఇలా చేయండి!