నేడు సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గోన్నారు. కలెక్టర్ కార్యలయం ప్రారంభించారు. అనంతరం రోడ్‌షోలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రోడ్‌షోలో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాను తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని కేసీఆర్ అన్నారు. అనేక అద్బుతమైన భవనాలు వస్తాయని తెలిపారు. సిద్దిపేట అన్ని పట్టణాల్లా కాదని ఇవాళ సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇవాళ ఇదంతా చూస్తుంటే తనకు కళ్లలోంచి ఆనంద భాష్పాలొస్తున్నాయని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ఇవాళ తన జీవితంలో ఇదొక అద్భుతమైన ఘట్టమని తెలిపారు. సిద్దిపేటకు చేస్తానన్న వాటిలో జిల్లాను చేశామని ఇక గోదావరి నీళ్లు రావడం, రైలు మార్గం రావడం మిగిలి ఉన్నాయని తెలిపారు. మొన్ననే కేంద్ర మంత్రి రైల్వే మార్గానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటకు మెడికల్ యూనివర్సిటీ రాబోతోందని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా ప్రత్యేకంగా ఉండాలని.. ఈ పట్టణం గొప్ప పట్టణంగా పేరొందాలనిఅన్నారు.
భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరిష్ రావు కేసీఆర్ కు నిర్వచనం చెప్పారు. K అంటే KNOWLEDGE(జ్ఞానము) అని, C అంటే COMMITMENT(నిబద్ధత) అని, R అంటే RECONSTRUCTION(తెలంగాణ పునర్నిర్మాణం) అని తెలిపారు. ఈ మూడింటిని నిజం చేసిన కేసీఆర్‌కు శిరసు వంచి పాదాభివందనం చేశారు. సిద్ధిపేట జిల్లా కావడం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. సిద్ధిపేట గురించి సీఎంకు చెప్పడమంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లే ఉంటుందన్నారు. సీఎం చెప్పిన మార్గంలోనే నడుచుకుంటున్నామని తెలిపారు. సిద్ధిపేటకు అన్ని ఇచ్చిన సీఎంకు రుణపడి ఉంటామన్నారు.