క్లౌడ్ బరస్ట్..అంటే ఏంటో తెలుసా?

151
- Advertisement -

క్లౌడ్ burst అనే పదం ఎప్పుడు వాడతారు అంటే ఒక గంటలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 110 మిల్లీ మీటర్ల వర్షం పడితే దానిని కుంభ వృష్టి లేదా క్లౌడ్ burst అంటారు. కుంభం అంటే కుండ అలాగే ఒక కుండ బద్దలు అయ్యి దానిలోని నీళ్ళు ఒకేసారి బయటికి వస్తే ? క్లౌడ్ బరస్ట్ అనేది చాలా అరుదుగా జరిగే ప్రక్రియ. దీనిని కృత్రిమంగా సృష్టించలేరు. అలా చేయాలంటే ఒకే చోట మేఘాలని ఆపేసి అవి కురిసెట్లుగా చేయాలి. మేఘాలు ఏమన్నా మేకలు,గొర్రెలా ? ఒకే చోట ఆపి అవి వర్షం పడేట్లుగా చేయడానికి ?

కృత్రిమ మేఘాలని సృష్టించ వచ్చు అదీ ఆ ప్రాంతంలో కొద్దో గొప్పో మేఘాలు ఉండాలి. కృత్రిమ మేఘాలని సృష్టించి కృత్రిమగా వర్షాలు కురిపించ వచ్చు అదీ చాలా కొద్ది మొత్తంలో మాత్రమే. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కృత్రిమ వర్షం కురిపించడానికి వెదర్ రాడార్[డాప్లర్ రాడార్] లని నెలకొల్పి ఆకాశం నుండి విమానం ద్వారా సాలిడ్ సిల్వర్ అయోడిన్[సిల్వర్ అయోడిన్ స్ఫటికములు రూపంలో ] మేఘాలలోకి వదులుతారు అలా వదిలిన సిల్వర్ అయోడిన్ స్ఫటికములు మేఘాలలోని తెమని గ్రహించి వాటిని వర్షంలా కురిసెట్లు చేస్తాయి. విమానం ఖర్చు,సిల్వర్ అయోడిన్ ఖర్చు తడిసి మోపడయింది కానీ వర్షాలు పడలేదు అప్పట్లో దాంతో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అలాంటిది దట్టమయిన మేఘాలని అదీ ఒకే చోట నిలిపి ఉంచి అవి వర్షించేట్లుగా చేయడం అసంభవం.

గత వారం రోజులుగా పడుతున్న వర్షాలు ఎక్కడా కూడా ఒకే రకంగా పడలేదు. కుండాపోతాగా అదీ ఒక్క గంటలో 100 మిల్లీ మీటర్ల వర్షం ఎక్కడ పడ్డది ?క్లౌడ్ burst అనేది 2015 లో ముంబై నగరంలో అదీ ఒకే రోజులో 110 మిల్లీ మీటర్ల వర్షం పడ్డది. దాంతో ముంబై నగరం వారం రోజులుపాటు స్తంబించిపోయింది. పల్లపు ప్రాంతాలు 4 అడుగుల లోతు నీళ్ళలో మునిగిపోయాయి అదీ వరద నీరు అరేబియా సముద్రంలోకి దారి తీసే డ్రైనేజీ వ్యవస్థ మూసుకు పోవడం ఒక కారణం అయితే సముద్రం నీరు భూమి మీదకి ఎదురు తన్నడం రెండవకారణం నీళ్ళు నిలిచిపోవడానికి. ఒక గంటలో ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో 100 లేదా 110 మిల్లీ మీటర్ల వర్షం పడితే దానిని క్లౌడ్ burst అంటారు కానీ ఈ మధ్య కాలంలో అలాంటి సంఘటన జరిగిన దాఖలాలు లేవు.

ఇక అమరనాథ్ లో వారం క్రితం వచ్చిన దానిని ఫ్లాష్ ఫ్లడ్ అంటారు. హిమాలయ ప్రాంతాలలో ఇవి సర్వ సాధారణంగా జరిగేదే ! వర్షాకాలం మేఘాలు హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర ఆగిపోతాయి ఎందుకంటే అంతకంటే ఎత్తులో అవి వెళ్లలేవు వాతావారణం చల్లగా ఉండడం వలన మేఘాలు ఎక్కువ ఎత్తులోకి వేళ్ళలేక అక్కడే ఆగిపోయి ఆ మేఘాలు వర్షించడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అవి వర్షిస్తాయి. అమరనాథ్ ప్రాంతంలో ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉన్నాయి అక్కడ మంచు కరిగి ఆ నీళ్ళు అక్కడే నిలవ ఉంటాయి వాటికి తోడు పెద్ద వర్షం పడితే ఆ నీరు బురదని తనతో తీసుకొని కిందకి వేగంగా ప్రవహిస్తుంది. ఇది నిత్యం జరిగేదే అక్కడ. డానికి విదేశీ కుట్ర అని ప్రజలకి అర్ధంకాని టెక్నికల్ పదాలని వాడి అయోమయం పడేట్లు చేస్తున్నారు కొందరు. ఇక మహారాష్ట్రలోని గోదావరి పరీవాహక ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు ఎప్పుడూ లేనిది నాశిక్ పట్టణాన్ని కూడా ముంచేసింది అయితే వరద నీరు వెళ్ళే ప్రాంతాలు కబ్జాకి గురవడం మూలంగా ఎటూ పోక చివరకి నాశిక్ పట్టణాన్ని ముంచేసి అలాగే దిగువకి ప్రవహించి తెలంగాణ లోని పరీవాహక ప్రాంతాలని ముంచేసింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఎక్కడా క్లౌడ్ బర్ట్స్ అయినట్లు వాతావరణ శాఖ ప్రకటించలేదు. వారం రోజులుగా ఆగకుండా కురిసిన వర్షాల వల్ల వచ్చిన సమస్య ఇది.

ఇక మూసీ నది కాచ్మెంట్ ప్రాంతాలలో ఎలాంటి కట్టడాలు కట్టడాన్ని నిషేధించే 111 GO రద్దు చేయడం ఇప్పుడు చర్చకి దారి తీస్తుంది. కాచ్మెంట్ ఏరియాలో కట్టాడాల మీద నిషేధం ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆ ప్రాంతాలలో ఇల్లు,అపార్ట్మెంట్ లు కడితే నీళ్ళు ఎక్కడికి పోతాయి ?కాళేశ్వం పంప్ హౌస్ మునిగిపోయి అందులో ఉన్న హెవీ పంప్ లు చెడిపోవడం వాటిని కాపాడే ఫ్లడ్ వాల్ మూడేళ్ళ కిందటే కూలిపోవడం వలన నీళ్ళు పంప్ హౌస్ లోకి వెళ్ళి పంప్ లు చెడిపోయాయి వాటిని మళ్ళీ పనిచేయెట్లు చేయాలంటే కానీసం 1000 కోట్లు ఖర్చు అవుతుందేమో ? పంప్ లలోకి బురద వెళ్ళిపోయి నీళ్ళు మొత్తం వెనక్కి వెళ్ళిపోయి వాటిని పనిచేయించాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. అసలే జీతాలు 8 తారీఖున ఇచ్చే పరిస్థితులలో మళ్ళీ వీటికోసం డబ్బు ఎక్కడినుండి తేవాలి ? అంచేత క్లౌడ్ బరస్ట్ అని విదేశీ కుట్ర అని ఏవేవో చెప్పేస్తే అవి విని నమ్మే వాళ్ళకి కొంచెం ఊరట !

- Advertisement -