ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్. ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతుందని నిన్నటి నుంచి గట్టిగా వార్తలొస్తున్నాయి. యూఎస్‌లో ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ చేయగా భారీ రేంజ్‌లో టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పుడు రిలీజ్ వాయిదా అవడంతో బుకింగ్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కిచ్చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో సలార్ వాయిదా కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అసలు ‘సలార్’ మూవీ రిలీజ్ వాయిదా పడటానికి ముఖ్య కారణం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అని టాక్.
గ్రాఫిక్స్ పనులు ఆలస్యం కావడంతోనే ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అవుతున్నట్లు తెలుస్తోంది. CG వర్క్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభిస్తున్నారని.. అందుకే డిసెంబర్‌కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా ‘సలార్’ మూవీ ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. మరి వాయిదా పడింది కాబట్టి.. మళ్లీ ఏ డేట్ కి ఫిక్స్ అవుతుందో చూడాలి. మరోపక్క ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు సలార్ పైనే ఉన్నాయి. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న సలార్ సినిమాతో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read:‘హరి హర వీర మల్లు’ …పవన్ బర్త్ డే ట్రీట్

