వేసవి సమస్యలకు నీటి చిట్కాలు..

283
summer
- Advertisement -

వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక వేసవి కాలంలోనే ఎక్కవగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే కొన్ని కొన్ని సమస్యల్ని నీటి ద్వారా దూరం చెయ్యవచ్చు. ముఖ్యంగా వేసవి సీజన్లో దాహం అధికంగా ఉంటుంది. అలా అని ఎలా పడితే అలా నీరుతాగడం మంచిది కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

నీళ్లను కొంచెం కొంచెం నిదానంగా తీసుకోవడం వల్ల నీటిలోని ఆల్కిలీన్‌లు లాలాజలంతో కలిసి పొట్టలో ఆమ్ల స్థిరీకరణకు సమయం ఉంటుంది. అంతే కాకుండా మెల్లగా నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేస్తుంది. కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకుంటే రోజంతా తాగిన అనుభూతి కలిగి, సంతృప్తి చెందడమే కాకుండా అతిగా తినడాన్ని కూడా నిరోధిస్తుంది.

రోజులో చాలాసార్లు ఆకలవుతున్నట్లు భావిస్తే అది దాహానికి సంకేతం. కాబట్టి ఆకలిని నియంత్రించడానికి నీటిని తీసుకోవాలి. కూలింగ్‌ వాటర్‌ తాగడం వల్ల జీర్ణరసాలు కూడా నాశనమవుతాయి. పొట్టని 50 శాతం ఆహారంతోనూ, 25 శాతం నీటితోనూ నింపి మిగతా 25 శాతం ఖాళీగా ఉంచాలట. దీని వల్ల ఆహారం ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగా జీర్ణమౌతుంది.

నిద్రలేవగానే రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. భోజనానికి అరగంట ముందు ఓ గ్లాసు నీళ్లు తాగాలి. అయితే ఒకేసారి ఎక్కువ నీరు తాగుతున్నారంటే ఆనారోగ్యంతో బాధపడబోతున్నారని గుర్తించాల్సిందే. ఇక పడుకునే ముందు ఓ గ్లాసు, వ్యాయామానికి ముందు, పూర్తయిన తర్వాత ఓ గ్లాసు తీసుకోవాలి. సీసాల ద్వారా నీళ్లు తాగడం మానుకోవాలి. ఇక ఇవన్నీ వేసవిలో ఫాలో అయితే ఈ సీజన్‌లో వచ్చే ఆరోగ్య సమస్యల్ని సులువుగా తగ్గించుకోవచ్చు.

Also Read:Sukumar:సుక్కు నెక్ట్స్ ఎవరితో?

- Advertisement -