Pawan:పవన్ ‘ వీరమల్లు ‘ సంగతేంటి?

20
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ” హరి హర వీరమల్లు ” ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. 2020 లో సెట్స్ పైకి వెళ్ళిన ఈ మూవీ ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. ఈ మూవీ షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది. ఈ మూవీ కంటే వెనుక స్టార్ అయిన ‘ ఓజీ ‘, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు సెట్స్ పై ఉంటే.. వీరమల్లు మాత్రం ఎలాంటి అప్డేట్స్ లేకుండా మరుగున పడుతోంది. అసలు ఈ మూవీ ఉందా ? లేదా ఆగిపోయిందా అనే సందేహాలు కూడా పవన్ అభిమానుల్లో వ్యక్తమౌతున్నాయి. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీ నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రాజెక్ట్ పై క్రిష్ వర్క్ చేస్తున్నప్పటికి పవన్ వీరమల్లు షూటింగ్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని, అందుకే క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కూడా వీరమల్లు స్టోరీ పై ఆసక్తిగా లేరని టాక్. దాంతో వీరమల్లు ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి ఇతర సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పవర్ స్టార్ ఉన్నారు. ఇక ఇదే ఏడాది ఎలక్షన్స్ కూడా ఉండడంతో వీరమల్లు ప్రాజెక్ట్ పూర్తిగా పక్కన పడినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకుంటే వేరే దర్శకుడెవరు ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. రాబిన్ హుడ్ తరహాలో పీరియాడిక్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు చిత్రయూనిట్ గతంలోనే ప్రకటించింది. పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీకి ఇలా ఎన్నో అడ్డంకులు ఏర్పడుతుండడం అభిమానులు నిరాశ పరిచే అంశం.. మరి ఈ మూవీ అసలు కంప్లీట్ అవుతుందా ? లేదా అలాగే మరుగున పడుతుందా ? అనేది చూడాలి.

Also Read:‘భీమా’.. ఫస్ట్ సింగిల్

- Advertisement -