Monday, December 23, 2024
Home టాప్ స్టోరీస్ జమిలి ఎన్నికల సంగతేంటి? 

జమిలి ఎన్నికల సంగతేంటి? 

39
- Advertisement -
“ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్” నినాదంతో గత ఏడాది జమిలి ఎలక్షన్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్నీ రాష్ట్రాలకు కలిపి ఒకే సారి ఎలక్షన్స్ నిర్వహించాలని మోడి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తూ వచ్చింది. అందుకోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ప్రముఖుల అభిప్రాయాలు, ప్రాంతీయ పార్టీల వైఖరి.. ఇలా అన్నిటిని భేరీజు వేసుకొని జమిలి ఎలక్షన్స్ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం ఆలోచించింది. జమిలి ఎలక్షన్స్ నిర్వహణకు చాలా పార్టీలే మద్దతు తెలిపాయి. అయినప్పటికి ఇంత వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. గత ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
మరి జమిలి ఎన్నికల సంగతేంటి ? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏప్రెల్ లేదా మే లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే జమిలి ఎన్నికల విషయంలో మోడీ సర్కార్ వెనకడుగు వేస్తోందనే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా దేశంలోని అన్నీ రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించడం అంతా తేలికైన విషయం కాదు. కానీ బడ్జెట్ తగ్గించేందుకే జమిలి ఎలక్షన్స్ అని మోడీ సర్కార్ చెబుతోంది. కానీ బీజేపీకి లాభం చేకూర్చేందుకే మోడీ సర్కార్ జమిలి ఎలక్షన్స్ నినాదం పటిస్తోందనే విమర్శలు కూడా వ్యక్తమౌతూ వచ్చాయి. మరి ఇంతకి జమిలి ఎలక్షన్స్ పై మోడీ సర్కార్ ఏం ఆలోచిస్తుందనేది ఇంకా మిస్టరీగానే ఉంది. మరి ముందు రోజుల్లో ఎలక్షన్స్ విషయంలో ఏం జరగబోతుందో చూడాలి.
- Advertisement -