వెస్టీండీస్ ఆల్రౌండర్ ఆటగాడు బ్రావో ఐపీఎల్లో చెన్నై తరపున ఆడి తన ఆటతీరుతో కోట్లాది మంది భారతీయ అభిమానులను సంపాధించుకున్నారు. అయితే బ్రావో మాత్రం బాలీవుడు కథానాయిక దీపికా పదుకోనేకు వీరాభిమానిగా మారిపోయాడు. తనను ఒక్కసారి కలిసి ముచ్చటించాలనేది తన చిరకాల కోరికగా సహచరుడు హర్బజన్ సింగ్తో తన మనసులోని మాటని బయటపెట్టాడు.
2006లో చాంపియన్స్ టోఫ్రీలో భాగంగా మొదటిసారి ఇండియాకి వచ్చాడు బ్రావో. ఈ నేపథ్యంలో హోటల్ గదిలో బస చేసిన సయమంలో టీవీలో ఓ సబ్బు ప్రకటనలో దీపికాను చూశాడు. ఆ రోజు నుంచి తనకు అభిమానిగా మారిపోయానని బజ్జీతో చెప్పుకొచ్చాడు బ్రావో. తనను ఒక్కసారి కలుసుకుని ముచ్చటించాలని తన చిరకాలకోరికగా మనసులోని మాటను చెప్పేశాడు.
అయితే వెస్ట్ ఇండీస్లో దీపికా పదుకునే లాంటి వ్యక్తిని గుర్తించలేదా అంటూ బజ్జీ సరాదాగా అనగా.. అందుకు బ్రావో నీవు మరో దీపికను గుర్తించలేవు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒకే దీపికా అంటూ సమాధానం ఇచ్చాడు. మరి ఈ వెస్టీండీస్ క్రికెటర్ చిరకాలకోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి ఇక.