యువకుడిని చావబాదుతున్న కలెక్టర్..!

239
IAS officer
- Advertisement -

ఓ కలెక్టర్ స్థానిక యువకుడిని విచక్షణా రహితంగా చావబాదాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పశ్చిమ బెంగాల్ అధికార వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. కలెక్టర్ హోదాలో ఉన్న ఆయనే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయంలోకి వెళ్లితే.. కేరళకు చెందిన నిఖిల్ నిర్మల్‌ 2011 బ్యాచ్‌కు చెందిన బెంగాల్ కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం అలిపుర్‌దువర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

నిర్మల్ భార్యపై స్థానిక యువకుడు ఒకరు ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఫలకట పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అతగాడు పట్టుబడినట్టు తెలియడంతో కలెక్టర్ తన భార్యతో సహా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. వస్తూ వస్తూనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచక్షణా రహితంగా కొట్టడం మొదలుపెట్టారు. కలెక్టర్ భార్య కూడా ఆకతాయిని తిడుతూ చేయిచేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ ఇంచార్జ్ సౌమ్యజిత్ రే సమక్షంలోనే ఇదంతా జరడం గమనార్హం.

West Bengal IAS officer thrashes youth

నాకు వ్యతిరేకంగా నా జిల్లాలో నిన్ను ఏమీ చేయనివ్వను. నీ ఇంట్లోకి వచ్చి మరీ చంపుతా అని కలెక్టర్ ఆ యువకుడిని బెదిరించాడు. ఈ పని చేయమని నీకు ఎవరు చెప్పారో చెప్పాలంటూ అతని భార్య కూడా యువకుడిని మందలించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

క్షమించాలని ఆ యువకుడు కోరుతున్నా వినకుండా కలెక్టర్ దంపతులిద్దరూ అతన్ని తీవ్రంగా కొట్టారు. పోలీస్ స్టేషన్‌లోనే అతన్ని కొడుతున్నా పోలీసులు అడ్డు చెప్పలేకపోయారు. నిజానికి అప్పటికి ఆ వ్యక్తిపై వాళ్లు అధికారికంగా ఫిర్యాదు కూడా చేయలేదు. ఈ ఘటనపై అటు కలెక్టర్‌గానీ, ఇటు పోలీసులుగానీ ఏమీ స్పందించలేదు.

https://youtu.be/LM1vTz498fQ

- Advertisement -