గ్రీన్ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన శ్రీధర్ చుండురి..

430
Sridhar Chunduri
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సైబరాబాద్ సిపి సజ్జనార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన వెల్స్ ఫర్గో (Wells Fargo) కంపెనీ సెంటర్ హెడ్ శ్రీధర్ చుండూరి నేడు రాయదుర్గంలోని తమ కార్యాలయం ఆవరణంలో 100 మంది సిబ్బందితో కలిసి 200 మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ ఛాలెంజ్‌లోకి నన్ను ఆహ్వానించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఛాలెంజ్‌ను కొనసాగించడానికి నేను మరికొంత మందికి ఈ ఛాలెంజ్ ఇస్తున్నాను అని వారు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఇందులో 1) VenkatRaghavan Head Factsheet 2) Murali head ZenQ 3)AVRanganath, IPS SP 4)SriniPitchala, Center Head DXC 5)PrakashBhodla, CenterHead UTC.

Green Challenge

- Advertisement -