తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు శుభవార్తనందించింది. విధి నిర్వహణలో నిరంతరం కష్టపడుతున్న పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రయోగాత్మకంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇవాల్టి నుంచి పోలీసులకు వారంతపు సెలవులు అమలు చేస్తున్నారు.
కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ అధికారి వరకు వీక్లీ ఆఫ్లు అమలు చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
నిరంతరం కేసులతో కుస్తీ పడేవారికి వీక్లీ ఆఫ్ ఊరటనివ్వనుంది. పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వడమనే ప్రతిపాదన చాలాకాలంగా వున్నా అన్నిస్థాయిల్లోనూ ఉన్న సిబ్బంది కొరత కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. తాజాగా గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వారాంతపు సెలవును అమలు చేస్తామని ప్రకటించడం పోలీసు కుటుంబాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.