రివ్యూ : వెడ్డింగ్ డైరీస్(రీ సెట్ అండ్ రీ స్టార్ట్)

25
- Advertisement -

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం వెడ్డింగ్ డైరీస్ . MVR స్టూడియోస్ బ్యానర్ పై డా. మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. ట్రైలర్‌తోనే అంచనాలను పెంచేసిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ :

ప్రశాంత్(అర్జున్ అంబటి) ఓ ఫేమస్ ఫోటోగ్రాఫర్. మోడలింగ్ ఫోటోగ్రాఫర్ గా ఎదగాలన్నది ఇతని డ్రీం. అయితే ఇంతలో శృతి(చాందినీ తమిళరసన్) ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ బోటిక్ లో డిజైనర్ గా పనిచేస్తుంటుంది. ప్రశాంత్ ప్రేమని అర్ధం చేసుకుని.. అతనికి ఓకే చెబుతుంది. పెద్దల్ని ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీరికి ఓ పాప, బాబు జన్మిస్తారు. అప్పటివరకు సంతోషంగా జీవించిన వీరి మధ్య మనస్పర్థలు వస్తాయి. ఫ్యామిలీ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేయలేక ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు. ఒక దశలో విడాకులు తీసుకోవడానికి కూడా రెడీ అవుతారు. ఆ తర్వాత ఏమైంది? ప్రశాంత్ – శృతి విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయారా? లేక మళ్ళీ కలిసిపోయారా? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ దర్శకత్వం, సెకండాఫ్, నటీనటులు. అర్జున్ అంబటి ప్రశాంత్ పాత్రలో ఒదిగిపోయాడు. ‘రాజా రాణి’ లో ఆర్యని తెలుగు ప్రేక్షకులు ఎంతబాగా ఓన్ చేసుకున్నారో..ఈ సినిమా చూస్తే అర్జున్ అంబటిని కూడా అంత బాగా ఓన్ చేసుకుంటారు అనడంలో సందేహం లేదు. హీరోయిన్ చాందినీ సినిమాకు మరింత గ్లామర్ తెచ్చింది. రవి శివ తేజ, చమ్మక్ చంద్ర,సీనియర్ నటి జయలలిత తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కట్టిపాడేస్తాయి. సంగీతం బాగుంది. ముఖ్యంగా పాటలు వినడానికే కాదు చూడటానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్. ఈశ్వర్ సినిమాటోగ్రఫీకి వంక పెట్టలేం. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Also Read:35-చిన్న కథ కాదు…సాంగ్

తీర్పు:

ప్రేమించి, పెళ్లి చేసుకోవడం… ఆ తర్వాత హీరో, హీరోయిన్స్ మధ్య మనస్పర్థలు రావడం అనేది చాలా సినిమాల్లో చూసిన పాయింటే అయినా తాను చెప్పదలచుకున్న కథను ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోయిన సెకండాఫ్ మాత్రం చాలా బాగుంది. యూత్ ని మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. మొత్తంగా ఈవీకెండ్‌లో చూడదగ్గ చిత్రం వెడ్డింగ్ డైరీస్.

రేటింగ్ : 3.25/5

- Advertisement -