భారీగా వర్షాలు.. కప్పలకు విడాకులు

912
Frogs Marrigae And Divarce

వర్షాలు పడకపోతే పల్లె టూర్లలో కప్పలకు పెళ్లిళ్లు చేస్తుండటం సహజంగా చూస్తుంటాం. రెండు కప్పలకు ఒక గునపానికి కట్టి ఇంటింటికి తిరుగుతూ వాటి మీద నీళ్లు పోస్తూ ఉరేగిస్తారు. ఇది సహజంగా పల్లెటూర్లలో జరగడం మనం చూస్తుంటాం. తాజాగా మధ్య ప్రదేశ్ లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది.

వానలు పడటం లేదని రెండు కప్పలకు పెళ్లిళ్లు చేశారు గ్రామస్తులు. దీంతో కొద్ది రోజుల తర్వాత వర్షాలు ఎక్కువగా కురుస్తు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించిన గ్రామస్తులు మళ్లీ అదే కప్పలకు విడాకులు ఇప్పించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. ఇక్కడి ఇంద్రపురి ప్రజలు ఇటీవల వర్షాల కోసం దేవుడిని ప్రార్థిస్తూ, కప్పలకు పెళ్లి చేశారు. ఆపై కుండపోత వర్షాలు కురిశాయి.

Frogs Marriage

ఈప్రాతంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్ధ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో వర్షాలు ఆగిపోవాలన్న ఉద్దేశంతో శివ్ సేవా శక్తి మండల్ సభ్యులు ఆ కప్పలను తీసుకోచ్చి సంప్రదాయ బద్దంగా వాటికి విడాకులు ఇప్పించారు. ఇలా చేస్తే వర్షాలు తగ్గుతాయని వారి నమ్మకమట. చూడాలి మరి వారి వింత ప్రయత్నం ఫలిస్తుందో లేదో.