ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి ఎక్కువ కాలం నిలబడదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజల రుణం తీర్చుకుంటామని…ఎన్డీయేతోనే ప్రయాణం కొనసాగిస్తానని తెలిపారు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు…ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
తన రాజకీయ జీవితంలో ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. ఓటుతోనే నియంకుశత్వానికి ప్రజలు బుద్దిచెప్పారన్నారు. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనంతో ఏదైనా చేస్తామనే ధోరణిని ప్రజలు తిరస్కరించారన్నారు. తనతో సహా తమ అభ్యర్థులందరూ భారీ మెజార్టీతో గెలిచారన్నారు.
టీడీపీ గెలవని మంగళగిరి లాంటి చోట 91 వేల మెజార్టీని అందించారన్నారు. ఓడితే కుంగిపోలేదు..గెలిచినప్పుడు గంతులేయలేదని.. ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పారు. కూటమికి బీజం వేసింది పవన్ కల్యాణే అని… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని..పవన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని చంద్రబాబు గుర్తుచేశారు. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని చెప్పానని ఇప్పుడు దానిని నిలబెట్టుకున్నానని చెప్పారు.
Also Read:పరాజయం పాలైన కేంద్రమంత్రులు వీరే..