ఫార్ములా-ఈ కేసులో మంత్రిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నేను ఎప్పుడు అధికారులను బలిపశువులు చేయలేదు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్.రాజకీయం అంటే అట్ల చేయాలి.. అంతే కానీ మంచి జరిగితే నాది చెడు జరిగితే అధికారుల మీద నెట్టే కుసంస్కారం మా పార్టీకి లేదు అన్నారు.
అలాగే రేవంత్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉండాలి.. ఈ దిక్కు మాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు లేదు అన్నారు. ప్రజలకు కోపం వస్తే వాళ్ళే రోడ్డెక్కి ప్రభుత్వాన్ని తొక్కుతారు బాంగ్లాదేశ్‌లో లాగా… పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయారు రేవంత్ రెడ్డి ఎంత? అన్నారు.
ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం.. మా దగ్గర కూడా ప్రజలు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్తున్నారు, కానీ ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డే అధికారంలో ఉండాలి.. అప్పుడే ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలంటే భయపడతారు అన్నారు.
Also Read:యూరప్‌కు చంద్రబాబు..
ట్వీట్ చేసినా కేసులు పెడుతున్న పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న ఆ కొంత మందిని ఎవరిని వదిలి ప్రసక్తే లేదు.. మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాము అన్నారు.

