KCR:వడ్లు కొనాలని కాళ్లు మొక్కుడు ప్రజా పాలనా?

24
- Advertisement -

వడ్లు కొనాలని కాళ్లు మొక్కుడు ప్రజా పాలనా? అని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్. టీవీ9 ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేసీఆర్…జనగామలో ఓ మహిళ బాంచెన్‌.. కాల్మొక్తా ధాన్యం కొనుండ్రని పోలీసుల కాళ్లు మొక్కుతోంది. దీన్ని దొరలపాలన అంటరా.. దర్జాగా కాలు మీదకాలేసుకొని రైతు నడింట్ల ఉండుడు దొరలపాలనా? అని మండిపడ్డారు.

దొరపాలన, గడీల పాలన అంతం చేశామంటున్నారు. దీనికి ఏం సమాధానం చెబుతారు..నేను దొరనా.. మా సామాజికవర్గాన్ని వెలమదొరలు అని పిలుస్తరు. ఐ యామ్‌ ప్రౌడ్‌ టూ బీ ఏ వెలమ దొర. ఐ డోంట్‌ థింక్‌ ఎనీథింగ్‌ ఫర్‌ దట్‌ అన్నారు. జనగామలో ఓ మహిళ బాంచెన్‌ కాల్మొక్తా ధాన్యం కొనుండ్రి అని పోలీసుల కాళ్లు మొక్కింది. దీన్ని దొరలపాలన అంటారా.. దర్జాగా కాలు మీదకాలేసుకొని రైతు నడింట్ల రందిలేకుంట ఉన్నది దొరలపాలనా? ఆలోచించాలన్నారు.

1100 గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఉన్నత చదువులు చెప్పింది దొరలపాలనా? పేద విద్యార్థులకు 20 లక్షల చొప్పున ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ ఇచ్చింది దొరల పాలనా? వృద్ధులకు 200 పెన్షన్‌ను రూ.2వేలు చేసింది దొరలపాలనా..? ఆలోచించాలన్నారు. రైతుబంధు పూలల్లో పెట్టి బ్యాంకుల్లో వేసినోళ్లం మేంము. రైతులను ఎంతగా పీడిస్తున్నరు. పండిన వడ్లు కొంటలేరు అని మండిపడ్డారు కేసీఆర్.

రాజకీయ నాయకులు ఉద్వేగాలను, విషయ తీవ్రతలను ప్రజల్లోకి పంపించేందుకు వ్యంగ్యాన్ని వాడుతరు. ఇది సహ జం. నాపై సమైక్యవాదులు చేసిన దాడి, ఆరోపణలు అంతా ఇంతా కాదు. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టిన…ఈ ముఖ్యమంత్రి వాడుతున్న భాషను ఎప్పుడూ నేను వాడలే అన్నారు. బీఆర్ఎస్ ప్రజల వాయిస్‌ అని…ప్రతిపక్షంగా తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తామన్నారు.

Also Read:TTD:వైభవంగా ముగిసిన తెప్పోత్సవాలు

- Advertisement -