కేంద్రం కోరితే భారత్ వస్తా: రఘురాం రాజన్

282
rafhuram rajan politics
- Advertisement -

కరోనా నేపథ్యంలో ప్రపంచం తీవ్ర మాంద్యంలో ఉందని తెలిపారు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్. కేంద్ర ప్రభుత్వంతో విధానపరమైన విభేదాల కారణంతో 2016లో ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

ఓ మీడియా టెలిఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన భారత ప్రభుత్వం తన సేవలను తిరిగి కోరుకుంటే తప్పకుండా తిరిగివస్తానని అన్నారు. ఇటలీ, అమెరికా తరహాలో వైరస్ విజృంభిస్తే ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించడం చాలా కష్టమవుతుందని ఆయన చెప్పారు.

కరోనా మహమ్మారి మళ్లీ విస్తరించకుండా ఉంటే వచ్చే ఏడాది భారత ఆర్ధిక పరిస్ధితి కోలుకుంటుందని ఆశించవచ్చన్నారు. ఎప్పుడూ ఇబ్బందులు మొదట విదేశీమారకం విషయంలోనే వెల్లడి అవుతాయని, ఈసారి పరిస్థితి రిజర్వ్ బ్యాంక్ నుంచి లభించిన కొద్దిమోస్తరు మద్దతుతో కొంత స్థిరంగానే ఉందని రఘురామరాజన్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -