గెలుపు మనదే:కేసీఆర్

296
kcr pragathi bhavan
- Advertisement -

ఎన్నికల్లో గెలుపు మనదే అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. పార్టీ అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌ వైపే ఉన్నారని తెలిపారు. ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తామని వందకు పైగా స్థానాల్లో గెలుస్తున్నామని తెలిపారు.

మహాకూటమికి ఘోర పరాజయం తప్పదన్నారు. ఎన్నికలకు ముందే కూటమి విచ్చిన్నమైందని ప్రకటనల్లో చంద్రబాబు ఫొటో తొలగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మీ కష్టానికి తగిన ఫలం దక్కుతుందని స్పష్టం చేశారు.

దశాబ్దాల పాటు కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణను దగా చేశాయని గత హామీలను అమలు చేయలేదన్నారు. కూటమి మేనిఫెస్టోలో నమ్మలేని వాగ్దానాలున్నాయని ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తామని చెప్పి రుణం అని బుకాయిస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభజంనానికి భయపడి చంద్రబాబు ఫోటోను తొలగించారన్నారు.

ప్రగతిపథంలో సాగుతున్న తెలంగాణకు ఎన్నికల ఫలితాలు గొప్ప స్ఫూర్తినిస్తాయని చెప్పారు. పోలింగు రోజు అభ్యర్థులంతా కష్టపడాలని సూచించిన కేసీఆర్ పోలింగు ముగిసే వరకూ ప్రజల్లో ఉండాలన్నారు. పోలింగు శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.

- Advertisement -