పుచ్చ‌కాయ గింజలతో ఉపయోగాలు..

231
Watermelon Seeds Benefits
- Advertisement -

ఎండాకాలం వచ్చిందంటే మన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు నిత్యం మంచినీరు లేదా పండ్ల రసాలను తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఎక్కువ నీటి శాతం ఉన్న పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో నీటి స్థాయి క్రమబద్ధీకరిస్తుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పుచ్చకాయ గింజల వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉందని వైద్య నిపుణులు చెప్పుతున్నారు. పుచ్చ విత్తనాల్లో కేలరీలు తక్కువ. కాపర్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్ లభిస్తాయి. వీటితో మనకు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దారం..!

జీవక్రియలకు సాయం- పుచ్చకాయ విత్తనాల్లోని ఫోలేట్, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా విలువైన పోషకాలు. వీటిల్లో అమైనో యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్ బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కలసి జీవక్రియలకు సాయపడతాయి. ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ అయిన.. ఒలిక్ యాసిడ్, లినోలియం యాసిడ్ ఇందులో ఉన్నాయి.

మధుమేహానికీ మంచిదే- మధుమేహం నియంత్రణకు సైతం పుచ్చవిత్తనాలు సాయపడతాయి. రక్తంలో పెరిగిన గ్లూకోజ్ ను తగ్గిస్తుంది.

చర్మ సంరక్షణ- పుచ్చకాయ విత్తనాల నుంచి తీసిన నూనెను ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నారు. చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుతుంది. ముడతలు పడడాన్ని ఆపుతుంది. పెనంలో పుచ్చవిత్తనాలను వేయించి గాలి చొరబడని డబ్బాలో పోసుకోవాలి. దీన్ని రోజూ స్నాక్ గా కొద్ది మొత్తంలో తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు.

Watermelon Seeds Benefits

వ్యాధి నిరోధక శక్త- బలమైన వ్యాధి నిరోధక శక్తికి, చక్కని ఆరోగ్యానికి పుచ్చ విత్తనాలు మేలు చేస్తాయి. వీటిల్లోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిత్యం కొన్ని విత్తనాలు తీసుకోవాలి. మంచిది కదా అని మరీ ఎక్కువ తీసుకోకూడదు.

ఎముకలు దృఢంగా- పుచ్చ విత్తనాల్లో కాపర్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండడం వల్ల, వీటితోపాటు ఇతర సూక్ష్మ పోషకాల సాయంతో మన ఎముకలు బలంగా తయారవుతాయి. ఎముకల సాంద్రతను కూడా పెంచుతుంది.

Also Read:బెంగళూరులో నీటి కటకట!

 
- Advertisement -