సీఎం కేసీఆర్‌పై వాటర్‌ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్రశంసలు..

83
- Advertisement -

అపరభగీరథుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వాటర్‌మ్యాన్ ఇండియాగా పేరుగాంచిన రాజేంద్రసింగ్‌ ప్రశంసల జల్లు కురింపించారు. గత ఏడేండ్లుగా జల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుతమని కితాబు ఇచ్చారు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో తెలంగాణను జీరో నుంచి హీరోను చేశారని కేసీఆర్‌ను కొనియాడారు. యావత్‌ దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌ అన్న రాజేందర్‌సింగ్‌.. కేసీఆర్‌ను చూసి దేశ నేతలు నేర్చుకోవాలని సూచించారు. జల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ‘వాటర్‌ యూనివర్సిటీ’ని నెలకొల్పాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు.

తాజాగా జలసౌధలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నీటి హక్కులను కాలరాయడమే కాకుండా, నీటి ప్రైవేటీకరణకు కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు.. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో జల సత్యాగ్రహం చేపడతామని ప్రకటించారు. దేశంలో జలవనరులకు ప్రధాన ఆధారం నదులేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కేంద్రీకరణ విధానాలతో జలావరణం తీవ్రంగా దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని వాణిజ్య సరుకుగా మార్చి, ప్రైవేటీకరించేందుకు బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతున్నదని ఫైర్ అయ్యారు.

జల సత్యాగ్రహ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, నదుల పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కాగా హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా రాజేంద్రసింగ్ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొన్నారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఆలయాన్ని పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ ఈ ఆలయం చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతంగా నిర్మిస్తున్నారని ప్రశంసించారు. మొత్తంగా తెలంగాణ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరంతో ప్రజలకు చుక్కనీరు అందింది లేదని, లక్ష కోట్ల అవినీతి జరిగిందని అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న బండి బ్యాచ్‌కు వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి.

- Advertisement -