తనపై మతం ఆరోపణలు నిరాధారమని తెలిపారు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. ఉత్తరాఖండ్ క్రికెట్ టీమ్ కోచ్ పదవికి వసీం జాఫర్ రాజీనామా చేయడం వివాదం రేపుతోంది. టీమ్‌లో సెలక్షన్ కమిటీ, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఉత్తరాఖండ్ సెక్రటరీ మహిమ్ వర్మ జోక్యం ఎక్కువవడం వల్లే తాను రాజీనామా చేసినట్లు జాఫర్ వెల్లడించారు.
టీమ్‌ను మతం ఆధారంగా చీల్చుతున్నాడని తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. అదే నిజమైతే వాళ్లే తనను తొలగించేవాళ్లు కదా అని ప్రశ్నించాడు. 15-20 ఏళ్ల పాటు నేను క్రికెట్ ఆడిన తర్వాత ఈ ఆరోపణలు వినడం చాలా బాధ కలిగిస్తోందని వెల్లడించాడు జాఫర్.
అర్హులైన ప్లేయర్స్‌ను తాను ప్రోత్సహించాలని చూడగా.. సెలక్షన్ కమిటీ, అసోసియేషన్ సెక్రటరీ మాత్రం కనీసం తన అభిప్రాయం కూడా తీసుకోకుండా టీమ్‌ను ఎంపిక చేసేవారని ఆరోపించాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో కెప్టెన్ సహా మొత్తం 11 మంది ప్లేయర్స్ మారిపోయారని, దీనిపై తనకు కనీస సమాచారం లేదని జాఫర్ చెప్పాడు.