ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తాజాగా వన్డేలకు వీడ్కోలు పలికి అందరిని షాక్ కు గురి చేశాడు. గత కొన్నాళ్లుగా వార్నర్ రిటైర్మెంట్ పై రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 2023 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత వార్నర్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ భావించారు. కానీ తనకు ఇంకా వయసు అయిపోలేదని, రిటైర్మెంట్ కు ఇంకా టైమ్ ఉందని చెబుతూ వచ్చారు వార్నర్. కానీ అనూహ్యంగా 2024 నూతన సంవత్సరం మొదటి రోజునే అందరికీ షాక్ ఇచ్చాడు. తాను వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని, తాను తప్పుకోవడం వల్ల కొత్తవారికి అవకాశం ఏర్పడుతుందని చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ ఇప్పటికే టెస్ట్ లకు గుడ్ బై చెప్పిన వార్నర్ భాయ్ ఇప్పుడు వన్డేలకు కూడా గుడ్ బై చెప్పడంతో గ్రేట్ ఓపెనర్ ను ఆస్ట్రేలియా టీం మిస్ అవుతుందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
అయితే 2025లో జరిగే ఛాంపియన్ ట్రోఫీలో తన అవసరం జట్టుకు ఉందని భావిస్తే మరలా తిరిగి ఆడతానని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పాటివరకు వన్డేలలో 161 మ్యాచ్ లు ఆడిన వార్నర్ 45.3 సగటుతో 6,932 పరుగులు చేశాడు. మొత్తం తన కెరియర్ లో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ కు భారత్ లో కూడా అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని, తన దేశం తర్వాత భారత్ ను సొంత దేశంలా భావిస్తానని వార్నర్ గతంలోనే చాలాసార్లు చెప్పుకొచ్చాడు. అందుకే ఇండియన్ అభిమానులు ముద్దుగా వార్నర్ భాయ్ అని పిలుచుకుంటారు. మొత్తానికి వార్నర్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
https://x.com/Ajaykumar180218/status/1741685078223454701?s=20
Also Read:BJP:లోక్ సభ ఎన్నికల్లోనైనా గెలుస్తారా?