KTR:తెలంగాణలో వార్నర్ బ్రదర్స్‌ పెట్టుబడులు

49
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ వరదలా ప్రవహిస్తుంది. అమెరికాలోని హాలీవుడ్‌కు చెందిన వార్నర్ బ్రదర్స్‌ డిస్కవరీ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టనుంది. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో డిస్కవరీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రపంచంలో టెలివిజన్, చలనచిత్రం, స్ట్రీమింగ్, గేమింగ్‌లో విభిన్నమైన కంటెంట్, బ్రాండ్‌లు, ఫ్రాంచైజీల పోర్ట్‌ఫోలియో కలిగిన ఏకైక సంస్థగా వార్నర్ బ్రదర్స్‌ నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…వార్నర్ బ్రదర్స్‌ డిస్కవరీ తెలంగాణ వినోద రంగంలోకి ప్రవేశిస్తోంది. తెలంగాణ వినోద రంగంలోకి డిస్క‌వ‌రీ రావ‌డం సంతోష‌క‌రం అని పేర్కొన్నారు. క్రియేటివిటీ, ఇన్నోవేష‌న్ హ‌బ్‌గా ఐడీసీ(అంత‌ర్జాతీయ అభివృద్ధి కేంద్రం)ని డిస్క‌వ‌రీ ఏర్పాటు చేస్తుంద‌న్నారు. మొద‌టి ఏడాదిలోనే 1200 మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని కేటీఆర్ తెలిపారు.

Also Read: దశాబ్ధి ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌గా సీఎస్‌ శాంతికుమారి

- Advertisement -