వేడి నీటిని అతిగా తాగుతున్నారా!

44
- Advertisement -

చాలామందికి వేడి నీరు తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా వ్యాధి బారిన పడినప్పుడు లేదా ఫ్లూ జ్వరం, టైఫాయిడ్ జ్వరం.. ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వేడి నీరు తాగాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. కొందరికి ప్రతిరోజూ ఉదయం పూట ఒక గ్లాస్ వేడి నీరు త్రాగే అలవాటు ఉంటుంది. ఇలా మితంగా వేడి నీరు త్రాగడం మంచిదే. ఎందుకంటే ఫ్లూ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా మలబద్దకం సమస్య కూడా దూరమౌతుంది. అయితే వేడినీరు తాగడం మంచిదని భావించి ప్రతిరోజూ అధికంగా వేడినీరు తాగితే ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. .

వేడినీరు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగిస్తుండట. ప్రతిరోజు అన్నీ సమయాల్లో వేడి నీరు త్రాగితే శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా నీటిని రోజుకు 4 లేదా 5 లీటర్లు తగాల్సివుంటుంది. ఇలా తాగడం వల్ల శరీరంలోని అవయవాల పని తీరు సక్రమంగా జరుగుతుంది. కానీ సాధారణ నీటికి బదులుగా వేడినీటిని తరచూ తాగితే శరీరానికి అవసరమైన మోతాదులో నీరు త్రాగలేము. తద్వారా అదనపు సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ముఖ్యంగా శరీరం బద్దకంగా మారిపోతుంది. అంతే కాకుండా మైగ్రీన్, తలనొప్పి, ఒళ్ళునొప్పులు వంటి సమస్యలు కూడా ఏర్పడతాయట. ఇంకా వేడి నీటిని అధికంగా తాగితే అన్నవాహికలోని సున్నితమైన కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వేడినీరు తరచూ తాగడం వల్ల పెదాలు, గొంతు పొడిబారుతుంది. అంతే కాకుండా దంతాలకు తరచూ వేడినీరు తాకితే ఏనామిల్ పొర దెబ్బతిని పంటినొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అధికంగా వేడి నీరు తాగకుండా కేవలం అనారోగ్యం బారిన పడినప్పుడు గోరు వెచ్చని నీరు త్రాగడం.. మిగిలిన సమయాల్లో కాచి చల్లార్చిన నీరు త్రాగడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:Revanth:ఢిల్లీకి సీఎం రేవంత్!

- Advertisement -