ఆ ఏసీపీ చీర లాగలేదు…. కాపాడారు

626
kajipet acp
- Advertisement -

హన్మకొండలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది మధ్య చోటు చేసుకున్న తోపులాటలో కాజీపేట ఏసీపీ ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించారంటూ కొన్ని వీడియోలు,ఫోటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వీడియోని విడుదల చేశారు.

ఆ వార్తలన్నీ అవాస్తవమని బాధిత మహిళతో ఏసీపీ దురుసుగా ప్రవర్తించలేదని పోలీసులు వివరణ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను మీడియాకు విడుదల చేశారు.

మహిళ చేతి నుంచి బాధిత మహిళ కొంగును తప్పించడంతో పాటు కొంగు లాగుతున్న మహిళను అడ్డుకుంటూనే సదరు మహిళకు కాజీపేట ఏసీపీ రక్షణగా నిలిచారని వివరణ ఇచ్చారు. ఇది యాదృశ్చికంగా జరిగిన ఘటన అంతేగానీ మహిళల పట్ల ఏసీపీకి ఎలాంటి దురుద్దేశం లేదని వివరించారు.

- Advertisement -