ఎంపీ సంతోష్‌ని కలిసిన వరంగల్ మేయర్..

232
mp santhosh kumar

వరంగల్ మేయర్ గా ఎన్నికైన సంధర్భంగా ఇవాళ ప్రగతి భవన్ లో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌ని కలిశారు గుండా ప్రకాశ్‌ రావు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎంపీ పసునూరి దయాకర్,ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ డాః కె వాసుదేవా రెడ్డితో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మఖ్యనాయకులు ఉన్నారు.

అంతకముందు సీఎం కేసీఆర్‌ని కలిసిన ప్రకాశ్‌ రావు ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కేటీఆర్‌తో సైతం భేటీ అయ్యారు గుండా ప్రకాష్. వరంగల్‌ మేయర్‌గా ఎంపికైన ప్రకాష్‌ను కేటీఆర్‌ ఈ సందర్భంగా అభినందించారు. మేయర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసినందుకు స్థానిక నాయకులతో పాటు పార్టీ ఇంఛార్జ్‌గా వ్యవహరించిన టీస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లుకు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌ నగర పాలక సంస్థ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకుపోవాలన్నారు.