మేడారం పరిసరాల్లో 200 సిసి కెమెరాలతో భద్రత చర్యలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వరంగల్ సిపి డాక్టర్ విశ్వనాధ రవీందర్. ములుగు పోలీస్ కార్యాలయంలో మేడారం జాతరపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మేడారం జాతరలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు తగు చర్యలు చేపట్టారు. సులువైన దర్శనం అసౌకర్యలు ప్రమాదాలు జరగకుండా సురక్షిత ప్రయాణానికి పోలీసులచే కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేశామన్నారు.
మేడారం జాతర చుట్టూ పన్నెండు వందల ఎకరాల లో రెండు లక్షల 50 వేల వాహనాలు నిలుపుటకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశాం. ముగ్గురు డిసిపి ల పర్యవేక్షణలో భక్తులకు అంతరాయం కలగకుండా మూడు ఎంట్రెన్స్ ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాం. 20 సెక్టార్లలో అడిషనల్ ఎస్పీ డీఎస్పీ స్థాయి అధికారులు చే ఫోర్ వీలర్ వెళ్లలేని పరిస్థితుల్లో టూ వీలర్ ద్వారా 30 మంది సిబ్బందితో మల్లం పల్లి నుండి ఊరట్టం వరకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా బందోబస్తు పరివేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు రోడ్లపై వాహనాలు నిలుపాకుండా, మద్యం సేవించి వాహనాలు నడపకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. పార్కింగ్ స్థలాల నుండి గద్దెల వద్దకు మినీ బస్సులు ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవార్ల దర్శనం అయ్యేలా కృషి చేస్తాం అన్నారు.