‘వార్ 2’ షూటింగ్ మొత్తం అక్కడే

25
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్‌’తో గ్లోబల్ స్టార్‌ గా మారిపోయిన జూ.ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ సినిమా చేయబోతున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఆల్ రెడీ మొదలు అయ్యింది. ముఖ్యంగా వార్ 2 షూటింగ్ ని ఆఘమేఘాలపై చుట్టెయ్యడానికి టీమ్ అన్ని రకాలుగా కసరత్తులు చేస్తోంది. ప్రతి రోజు వార్ 2 సెట్స్ లో షూటింగ్ అలిసిపోయేదాకా చేసి మరీ ఇంటికి చేరుకోవాలని దర్శకుడు అయాన్ ముఖ‌ర్జీ నియమం పెట్టుకున్నాడట. ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదల చెయ్యాలని అయాన్ ముఖ‌ర్జీ భావిస్తున్నాడు.

హృతిక్ రోషన్‌ కూడా నడుమ నొప్పి కారణంగా మొన్నీమధ్యనే కొద్దిరోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి.. మళ్ళీ వార్ 2 కి డేట్లు ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్యాప్ ఇవ్వకుండా షూట్ చేయడంలో ఎన్టీఆర్ కి నేమ్ ఉంది. కాబట్టి, వచ్చే నెల నుంచి రామోజీ ఫిలిం సిటీలో వార్ 2 షూటింగ్ శరవేగంగా చేయాలని లాంగ్ షెడ్యూల్ వేశారు. పైగా, రెండో యూనిట్ తో కూడా షూట్ చేయబోతున్నారని.. అంతేకాకుండా కుదిరితే మూడో యూనిట్ కూడా.. వార్ 2 కోసం రంగంలోకి దిగుతుంది అని తెలుస్తోంది.

‘వార్ 2’ మొత్తం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోనే పూర్తి చేసే ఆలోచనలో హృతిక్ రోషన్‌ – ఎన్టీఆర్ అండ్ టీమ్ ఉన్నారు అంటున్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన సెట్స్ నిర్మాణం చేపట్టాలని డిసైడ్ అవుతున్నారట. అంతేకాకుండా.. నల్లమల్ల అడవులకి కి వెళ్లి అక్కడ కూడా కీలకమైన ఒకటి రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ చేపడతారని టాక్. ఇప్పటికే, ఎన్టీఆర్ – హృతిక్ రోషన్‌ కూడా ఫారెస్ట్ సీక్వెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు అయాన్ ముఖ‌ర్జీ కూడా సాలిడ్ గానే ప్లాన్ చేస్తున్నాడు.

Also Read:హ్యాపీ బర్త్ డే…బాపు కేసీఆర్

- Advertisement -