కర్నాటక ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. రేపు పోలింగ్ జరగనుండగా ఈ నెల 15న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రచారం ముగింపు సభలో జేడీఎస్ నేత,మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో జేడీఎస్‌కు ఓటేసీ…నన్ను బతికించండి…అప్పుడే మిమ్మల్ని కాపాడకుంటా…లేనిపక్షంలో నేను ఎక్కువ కాలం ఉండనని తెలిపారు.
రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గం పరిధిలోని లగ్గెరెలో జరిగిన సభలో కుమారస్వామి మాట్లాడిన మాటలు కన్నడనాట ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఓ వైపు అనారోగ్యం ఉన్నా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నానన్నారు. నా ఆవేదన, ఆలోచన మీ చేతిలోనే ఉందన్నారు. కుమార స్వామి కావాలనుకుంటే జేడీఎస్‌ను గెలిపించాలన్నారు.
అభ్యర్థులు నగదు నగదు అంటూ ఎగబడుతున్నారని మా వద్ద అంత సొమ్ము లేదని నేనెక్కడికెళ్ళి పడాలని అభ్యర్థులకు ఎక్కువ మందికి సహకరించాలన్నారు. జేడీఎస్ అధికారంలోకి వస్తే మీ ఇంటి బిడ్డలాగా సేవలందిస్తానన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కర్నాటకలో రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని, వారి కన్నీటిని తుడిచే నేత కంటికి కనిపించడం లేదన్నారు. తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు రూ.2,500 కోట్లు రుణమాఫీ చేశానన్నారు.