- Advertisement -
వనపర్తి జిల్లాలో ఓ కొడుకు ముందే తండ్రిని చితకబాదిన సంఘటనపై కేటీఆర్ మండిపడిన సంగతి తెలిసిందే.సంబంధిత కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీని కేటీఆర్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో స్పందించారు వనపర్తి ఎస్పీ అపూర్వరావు. సంఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆమె..ప్రజలపై ఇలా ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని ఎస్పీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డికి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
- Advertisement -