- Advertisement -
వనపర్తి జిల్లాలో కొడుకు ముందే తండ్రిని చితకబాదిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటనపై సీరియస్ అయిన మంత్రి కేటీఆర్…సంబంధిత కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేంద్ రెడ్డిని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన జిల్లా ఎస్పీ అపూర్వరావు…ఆ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసింది.
ఘటన జరిగిన కొద్దిసేపటికే బాధితుడి ఇంటికెళ్లిన జిల్లా ఎస్పీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుడి కుమారుడితో కాసేపు మాట్లాడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు.
ఈ ఘటనపై ప్రజలకు క్షమాపణలు చెబుతున్నామని తెలిపిన జిల్లా ఎస్పీ…కానిస్టేబుల్ని సస్పెండ్ చేశామని తెలిపారు.
- Advertisement -