మొక్కలు నాటిన కలెక్టర్ శ్వేత మహంతి

679
Mahanthi
- Advertisement -

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించారు వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి. ఈరోజు తన క్యాంపు కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లా అధికారులందరికీ గ్రీన్ చాలెంజ్ విసురుతూ ప్రతి జిల్లా అధికారి వారి కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటాలని గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల కలెక్టర్లకు గ్రీన్ చాలెంజ్ విసిరారు.

- Advertisement -