పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్:బాస్ సాంగ్

139
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’ సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతి అప్డేట్ మాస్ కి పూనకాలు తెప్పిస్తోంది.

‘వాల్తేర్ వీరయ్య’ నుండి పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్- బాస్ పార్టీ సాంగ్ రేపు విడుదలౌతున్న సంగతి తెలిసిందే. దాని కంటే ముందు చిరంజీవి, ఊర్వశి రౌతేలాపై చిత్రీకరించిన ఈ పాట ప్రోమోని విడుదల చేశారు. ఈ పాట చిరంజీవి వింటేజ్ మాస్ అవతార్ ని ప్రజంట్ చేసింది. ప్రోమో పాటను చూడాలనే ఉత్సాహాన్ని పెంచింది.

ప్రోమోలో చిరంజీవి గళ్ళ లుంగీ, కలర్ ఫుల్ షర్ట్ లో తనదైన స్టయిల్ లో నడుస్తూ మెగా మాస్ ఎంట్రీ ఇచ్చారు. ప్రోమోలో కనిపించిన మెగా వాకింగ్ స్టయిల్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. అయితే మాస్ మూల విరాట్ దర్శనం కోసం పాట విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. మాస్ ని ఆకట్టుకొనే అదిరిపోయే ట్యూన్ ని కంపోజ్ చేశారని ప్రోమో చూస్తే అర్ధమౌతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు సాహిత్యం అందించడంతో పాటు నకాష్ అజీజ్, హరిప్రియతో పాటు ఆలపించారు.

మాస్ సాంగ్స్ స్పెషలిస్ట్ శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రాఫర్. పాటను చిత్రీకరించిన భారీ సెట్ను కూడా ప్రోమోలో చూడవచ్చు. లిరికల్ వీడియో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.

ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.

ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్ దేవరమానె ఎడిటర్గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి…

భారత్ జోడో యాత్రలో ప్రియాంక…

అమెరికా రైట్స్‌ను కొనుగోలు చేసిన శ్లోకా…

చిరంజీవికి శుభాకాంక్షలు :ఎఫ్దీసి చైర్మన్ అనిల్

- Advertisement -