వాల్తేరు వీరయ్య..రవితేజ ఫస్ట్ లుక్‌

127
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ ను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. రవితేజ ప్రీ లుక్ పోస్టర్.. ఫస్ట్ లుక్, టీజర్పై క్యూరియాసిటీని పెంచింది.

పవర్ ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ పాత్రను పవర్ ప్యాక్డ్ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ , టీజర్ను విడుదల చేశారు మేకర్స్. బిల్డ్-అప్ షాట్ లు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చాయి. మాస్ని ఎలా మెప్పించాలో బాబీకి తెలుసు. రవితేజ కారులో ఎంట్రీ ఇస్తూ.. చేతిలో మేక పిల్లతో దిగి, విలన్స్ ని ఇరగదీశారు. ‘ఏం రా వారీ.. పిస పిస చేస్తుండావ్.. నీకింకా సమజ్ కాలే.. నేను ఎవ్వనయ్యకీ యిననని” అని వార్నింగ్ ఇస్తూ రవితేజ చెప్పిన డైలాగ్ మాస్ కి పూనకాలు తెప్పించింది. అంతకుముందు” ”ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లని ఎత్తుకొన్న పులి వస్తా వున్నది” అన్న ఇంట్రో డైలాగ్ కూడా అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్స్ కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ టెర్రిఫిక్ గా కొరియోగ్రఫీ చేశారు.

‘పవర్’ తర్వాత తన మ్యానరిజమ్స్ , డైలాగ్ డెలివరీతో మాస్ ను అలరించే రవితేజ కోసం బాబీ మరో పవర్-ప్యాక్డ్ పాత్రను అందిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్తో టీజర్ కి మరింత ఇంటెన్సిటీని తీసుకొచ్చారు. ఇప్పటికే భారీ అంచనానలు వున్న ఈ సినిమాపై ఈ టీజర్ మరింత బజ్ పెంచింది.

ప్రస్తుతం టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్ గురించి మెగాస్టార్ చిరంజీవి.. ”అతని బ్యాగ్రౌండ్ – కేవలం హార్డ్ వర్క్.. అతని సపోర్ట్ – ప్రేమించే మాస్” అని ట్వీట్ చేయగా..” అన్నయ్య❤️ కానీ, అతని ధైర్యం – మీరు చూపించిన మార్గం 🙏” అని రవితేజ రీట్వీట్ చేయడం అభిమానులని అలరిస్తోంది.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్ లో లీడ్ పెయిర్పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి…

నేను స్టూడెంట్ సర్! మాయే మాయే లాంచ్‌

క్రిస్మస్ కానుకగా ప్రభాస్ ఎపిసోడ్

జనవరి నుంచే.. మహేష్ నుంచి క్లారిటీ

- Advertisement -