వాల్తేరు వీరయ్య.. మాస్ రాజ టీజర్ అదుర్స్ !

117
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ” వాల్తేరు వీరయ్య “. బాబీ కొల్లు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలాకాలం తరువాత చిరు లోని వింటేజ్ మాస్ యాటిట్యూడ్ ను మరోసారి ఈ మూవీతో ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నాడు డైరెక్టర్ బాబీ. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన టైటిల్ టీజర్, పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంచితే ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రవితేజకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్రాయునిట్ విడుదల చేసింది. టీజర్ రవితేజ లుక్ బాడీ లాంగ్వేజ్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. .

” ఏం రా వారీ.. పిస పిస చేస్తున్నావ్.. నికింకా సమజ్ కాలే.. ” అంటూ తెలంగాణ యాసలో రవితేజ చెప్పిన డైలాగ్స్ గుజ్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దాంతో మాన్ ఆఫ్ మాసస్ గా పేరున్న చిరంజీవి, మాస్ మహారాజ్ గా పేరున్న రవితేజ ఇద్దరు కలిసి చేసే ఈ మాస్ రచ్చ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలో మెగాస్టార్ మాస్ టీజర్ ను కూడా చిత్రయూనిట్ రెడీ చేస్తోందట. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సంక్రాంతికి చిరుతో పాటు నటసింహ నందమూరి బాలకృష్ణ, తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ కూడా పోటీలో ఉన్నారు. మరి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే మాస్ కంటెంట్ తో వస్తున్న చిరంజీవి ” వాల్తేరు వీరయ్య ” మూవీ తో ఈ సంక్రాంతి కి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -