వాల్తేరు వీరయ్య క్లైమాక్స్ కోసం

45
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి – రవితేజ హీరోగా రాబోతున్న సినిమా వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో రాబోతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ క్లైమాక్స్ షూటింగ్ గురించి లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. వచ్చే వారంలో మెగాస్టార్ – శ్రుతి హాసన్, రవితేజ మరియు కొందరు నటీనటుల పై సారథి స్టూడియోస్ లో ఈ క్లైమాక్స్ ను షూట్ చేయబోతున్నారు. ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కాబోతుంది.

ఇంకో 24 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు క్లైమాక్స్ షూట్ ప్లాన్ చేయడం ఏమిటి అంటూ మెగా ఫాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. ఆచార్య లాంటి భారీ ప్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. అందుకే, ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు లేటు షూట్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ మెసేజ్ లు చేస్తున్నారు.

అయితే, బెస్ట్ అవుట్ ఫుట్ కోసమే మేకర్స్ పెర్ఫెక్ట్ గా షూట్ ను ప్లాన్ చేస్తున్నారట. ఇక మరోపక్క ఓటిటి సంస్థలు కూడా ఈ సినిమా కోసం భారీగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ జీ 5 వారు ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఈ వాల్తేరు వీరయ్యని సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక మెగాస్టార్ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఏది ఏమైనా జనవరి 13న చిరు ఫ్యాన్స్ పండగ చేయడానికి ముమ్మరంగానే సన్నద్ధం అవుతున్నారు. ఎంతైనా మెగాస్టార్ చిరంజీవి – రవితేజ కలయిక కదా.

ఇవి కూడా చదవండి…

ధమాకా… ప్రీరిలీజ్

బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్.. గ్లింప్స్

వాల్తేరు వీరయ్య మెయిన్ ట్విస్ట్ అదే

- Advertisement -