ప్రస్తుతం దేశంలో ఈ–కామర్స్ వెబ్ సైట్స్ హవా నడుస్తోంది. సగం పైగా కొనుగోళ్లు ఈ కామర్స్ వెబ్ సైట్స్ ద్వారానే జరుగుతున్నాయంటే ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. కేవలం కొత్త వస్తువులనే కాకుండా సెకండ్ హ్యాండ్ వస్తువులను కూడా ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా అమ్మకానికి పెట్టే అవకాశం ఉండటంతో రోజురోజుకి ఆన్ లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.
అయితే,ఈ సారి మాత్రం ఓ వ్యక్తిని అమ్మకానికి పెట్టేశాడు ఓ ప్రబుద్దుడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఓ పాక్ క్రీడాకారుడిని ఈ-బేలో వేలానికి పెట్టాడు. ఇంతకీ అతడెవరో తెలుసా… భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గాయపడి… మొత్తం టోర్నీకే దూరమైన వహాబ్ రియాజ్. రియాజ్ పేలవ ప్రదర్శనతో అసంతృప్తి, ఆగ్రహానికి గురైన ఆ అభిమాని ఇలా వింతగా తన నిరసనను తెలియజేశాడు.
ఈ-బేలో రియాజ్ ధరను 610 ఆస్ట్రేలియా డాలర్లగా నిర్ణయించగా… ఇప్పటికే ఇతగాడి కోసం 54 మంది బిడ్లు దాఖలు చేసుకున్నారు. 2017, జూన్ 19తో వేలం ముగుస్తోందని సదరు అభిమాని పేర్కొన్నాడు. వహాబ్ రియాజ్.. అతడి అవసరం నాకు ఎప్పటికీ లేదు. ఐటమ్ కండీషన్: ఉపయోగంలో ఉన్నది అని పేర్కొన్నాడు.
గతంలో ఏకంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌నే పాత వస్తువుల అమ్మకం వెబ్‌సైట్ అయిన ‘ఈ బే’లో పెట్టేశాడు ఓ వ్యక్తి. నవాజ్ షరీఫ్‌ను అమ్మకానికి పెట్టిన నెటిజన్‌కు ఆయన పరిపాలన నచ్చనట్టుంది. అందుకే, ‘యూస్ లెస్ పాకిస్థాన్ పీఎం నవాజ్ షరీఫ్ ఫర్ సేల్’ అంటూ ఆయన ఫొటోను పెట్టి మరీ ‘ఈబే’ లో ఒక ప్రకటన ఇచ్చి సంచలనం రేపాడు.