- Advertisement -
టీమిండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్‌కు ఐసీసీలో కీలక పదవి లభించింది. మెన్స్ క్రికెట్ కమిటీలో భాగంగా ఆటగాళ్ల ప్రతినిధిగా ఎంపిక చేసింది ఐసీసీ. లక్ష్మణ్‌తో పాటు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరిని కూడా ప్రతినిధిగా ఎంపిక చేశారు. ఈ మేరకు జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఎన్‌సీఏ అకాడమీ హెడ్‌గా ఉన్న లక్ష్మణ్ ఐర్లాండ్ పర్యటనలో టీమిండియాకు హెడ్‌కోచ్‌గా వ్యహరించిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
2025లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2024లో బంగ్లాదేశ్, 2026లో మరో టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగనుంది.
- Advertisement -